Thursday, May 2, 2024

గోవా లో సూపర్ స్టార్…అదిరిపోయే ఫైట్ సీన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇటీవల ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలఅయింది. ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ కొరియోగ్రఫీ లో ఈ ఫైట్ సీన్ జరుగుతుంది. ఇక అందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పై దృష్టి పెట్టనున్నారు దర్శకనిర్మాతలు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement