Sunday, April 28, 2024

NBK :బాల‌య్య‌తో సుకుమార్ సినిమా…. ఆ హిట్ మూవీకి సీక్వెలా

నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ఇండస్ట్రీలో ఎలా జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు మనం చూస్తున్నాం . బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి యంగ్ హీరోలు చేయలేని సహసాలను చేస్తున్నాడు బాలయ్య. మొదటి అఖండ .. ఆ తర్వాత వీరసింహారెడ్డి.. ఆ తర్వాత భగవంత్ కేసరి.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకొని 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన బాలయ్య త్వరలోనే బాబీ దర్శకత్వంలో ఓ సినిమాకి ఫిక్స్ అయ్యాడు.అయితే ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తుంది.

పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న సుకుమార్ డైరెక్షన్లో బాలయ్య సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రచ్చ నెలకొట్టుందో అర్థం చేసుకోవచ్చు. అయితే సుకుమార్ బాలయ్యతో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కించబోతున్నారట . ఇందులో ఫ్యామిలీ సెంటిమెంట్స్ కూడా ఉంటాయి అంటూ తెలుస్తుంది.అంతేకాదు ఈ సినిమా గతంలో బాలయ్య నటించి హిట్ కొట్టిన సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా వస్తుందట. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య నత్తి ఉన్న క్యారెక్టర్ చేయబోతున్నాడట . అంత పెద్ద స్టార్ హీరో ఇలా నత్తి ఉన్న పాత్రను చేయడానికి అంగీకరించడం చాలా చాలా గ్రేట్ అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు . ముందు నుంచి బాలయ్య అంతే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడానికి ఒప్పుకుంటాడు . దట్ ఈజ్ బాలయ్య అంటూ నందమూరి ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement