Tuesday, April 30, 2024

మహేష్ ను కలిసిన సుకుమార్…కారణం ఏంటో తెలుసా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. మరోవైపు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ ఇద్దరూ ఇప్పుడు కలవడం హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏంటంటే… మహేష్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో యాడ్ కి సంబంధించిన షూటింగ్ చేస్తున్నాడు. ఆ పక్కనే సుకుమార్ సినిమా షూటింగ్ జరుగుతోందట.

ఇక సర్కారు వారి పాట టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ చూసి మహేష్ ను అభినందించడానికి సుకుమార్ అక్కడికి వెళ్లడం జరిగిందట. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 1 నేనొక్కడినే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement