Thursday, May 2, 2024

సాంగ్ రిహార్స‌ల్స్ లో షారుక్.. దీపిక‌

ఓ సాంగ్ కోసం రిహార్స‌ల్స్ చేస్తున్నారు స్టార్ న‌టులు షారుక్ ఖాన్..దీపిక ప‌దుకొనే. త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ తెర‌కెక్కిస్తున్న చిత్రం జ‌వాన్. కాగా జవాన్‌లో దీపికా పదుకొనే అతిథి పాత్రలో మెరవబోతుందని తెలిసిందే. ఈ క్రేజీ మూవీలో షారుఖ్‌, దీపికా పదుకొనే కాంబోలో ఓ పాట కూడా ఉండబోతున్నట్టు తాజా అప్‌డేట్ చెబుతోంది. షారుఖ్‌ఖాన్‌, దీపికా పదుకొనే పాట కోసం రిహార్సల్స్‌ చేస్తున్న స్టిల్ ఒకటి ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది. సిల్వర్ స్క్రీన్‌పై షారుఖ్‌, దీపికా పదుకొనే కాంబో అంటే పక్కా హిట్టు అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ లెక్కన జవాన్‌ కూడా హిట్‌ లిస్ట్‌లో చేరిపోవడం ఖాయమైనట్టేననిపిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన జవాన్ టైటిల్ అనౌన్స్ మెంట్‌ టీజ‌ర్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.

జవాన్‌లో షారుఖ్‌ ఖాన్‌ తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. తాజా అప్‌డేట్ ప్రకారం జవాన్ షూటింగ్ మంగ‌ళ‌వారం పూర్తి చేసుకుంది. మే తొలి వారంలో జవాన్‌ టీజర్‌ను లాంఛ్ చేయబోతున్నట్టు టాక్‌. జవాన్‌లో న‌య‌న‌తార ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌నున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని హోంబ్యానర్‌ రెడ్ చిల్లీస్ బ్యాన‌ర్‌పై షారుఖ్ ఖాన్‌ తెర‌కెక్కిస్తున్నాడు. కాగా షారుఖ్‌, నయనతార పై వచ్చే సాంగ్‌ షూట్ చేస్తున్న వీడియో నెట్టింట్లో హల్‌ చల్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement