Tuesday, May 21, 2024

SSR-MB | మహేష్‌-రాజమౌళి మూవీపై లేటెస్ట్ బజ్‌.. !

రాజమౌళి-మహేష్ రాబోయే యాక్షన్ అడ్వెంచర్ మూవీ అప్‌డేట్స్ కోసం సినీ ప్రేమికులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రకటనతో విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. ఇటీవలే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ అయినా ట్రెండింగ్‌లో నిలుస్తుంది.

ఈ పాన్ వరల్డ్ మూవీకి సంబంధించి మరో క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకి సాంకేతిక నిపుణుల జాబితా ఇదేనంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ఈ తాజా బజ్‌ ప్రకారం… ఈ మూవీ ట్రెక్నికల్‌ టీంలో ఆస్కార్‌ విన్నర్‌ ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌‌గా, పీఎస్‌ వినోద్‌ సినిమాట్రోగ్రఫర్‌గా.. ఆర్‌సీ కమల్‌ కణ్ణన్‌ వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌ వైజర్‌గా, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా మోహన్‌ బింగి, ఎడిటర్‌గా తమ్మిరాజు, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా రాజమౌళి భార్య రమా వ్యవహరించనున్నట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. ఇక దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement