Sunday, April 28, 2024

Spirit | ప్రభాస్ ఫ్యాన్స్‌కు అధిరిపోయే అప్‌డేట్..

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ త్వ‌ర‌లో తెర‌కెక్కున్న మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాపై డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి అధిరే అప్‌డేట్ అందించాడు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జూన్ లో ప్రారంభించనున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు సందీప్ రెడ్డి వంగా. అప్పటికల్లా డైలాగులపై కసరత్తులు పూర్తవుతాయని వివరించారు. భయం అన్నదే తెలియని ఒక కరడుగట్టిన పోలీస్ అధికారి కథతో ‘స్పిరిట్’ రూపొందనున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ పోలీసాఫీసర్ అనగానే ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

ఇక, ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘సలార్’ ఫస్ట్ పార్ట్ డిసెంబరు 22న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement