Friday, April 26, 2024

మెహర్ రమేష్ కు సోనుసూద్ సహాయం

లాక్ డౌన్ సమయం లో ఎంతోమంది పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించి దేవుడు అయ్యాడు సోనూసూద్. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి తన వంతుగా సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. తాజాగా సోనుసూద్ టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ కు సహాయం చేశారు. అసలు విషయం ఏంటంటే సోషల్ మీడియా వేదికగా మెహర్ రమేష్ ఓ ట్వీట్ చేశాడు. సోనుసూద్ బాయ్ హైదరాబాదులో ఉన్న బుడుగు వెంకటరమణ అనే వ్యక్తికి ఒక ఇంజెక్షన్ టోసిలిజంబ్ 400 మి.గ్రా, 1 టాబ్ బారిసిటినిబ్ 4 ఎంజి, 3 రెమిడిసివిర్ ఇంజెక్షన్లు అత్యవసరంగా కావాలి. కానీ సాధ్యం కాలేదు. సోనుసూద్ ఓన్లీ హోప్ అంటూ అభ్యర్థించాడు.

ఇక ఆ ట్వీట్ కు స్పందించిన సోను సూద్ మీరు అడిగిన ప్రతి మెడిసిన్ అందుతుంది బ్రదర్… ప్రాణాలను కాపాడుకుందాం అంటూ ట్వీట్ చేశారు. అంతే కాదు రిప్లై ఇచ్చిన కొన్ని గంటలలోనే అన్ని మందులు కూడా కరోనా రోగికి అందించాడు. అదే విషయమై మెహర్ రమేష్ సోనూసూద్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement