Thursday, April 25, 2024

న్యూమరాలజీతో కరోనా కిల్: ‘సూపర్’ స్టెనోగ్రాఫర్ ఛాలెంజ్

ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా మనదేశంలో కరోనా విళయతాండవం పీక్స్ లో ఉంది. అయితే ఈ మాయదారి జగమొండికి మూకుతాడు వేసే ఓ ఉపాయాన్ని చెబుతున్నాడు ఓ స్టెనోగ్రాఫర్. తాను చెప్పినట్లు చేస్తే కరోనాను తరిమికొట్టవచ్చిని ఛాలెంజ్ చేసి మరి చెబుతున్నాడు. ఈ కష్ట కాలం నుంచి చాలా సులభంగా భయటపడేందుకు న్యూమరాలజీనే ఓ ఆయుధం అంటున్నాడు అనంతపురం జిల్లాకు చెందిన ఓ స్టెనోగ్రాఫర్ ఆనందరావు. అదేంటి న్యూమరాలజీతో అదృష్టం కలసిరావడం కోసం తమ పేరులో చిన్న మార్పులు చేసి తర్వాత తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారనే ప్రశ్న ఎవరికైనా వస్తుంది. అయితే న్యూమరాలజీలో ప్రతి పేరుకు ఓ లెక్క ఉంటుందని…అలాగే కరోనా అనే పేరులో కూడా కొన్ని అక్షరాలను మార్చితే ప్రపంచానికి ఈ మాయదారి నుంచి విముక్తి లభిస్తుందని బల్లగుద్ది చెబుతున్నాడు ఆనందరావు.

ఇంగ్లీష్ లో CARONA అనే పేరును CORONAA గా మార్చాలని స్టెనో గ్రాఫర్ ఆనంద్ రావు చెబుతున్నారు. ఇలా మార్చిన పేరును పలికితే కరోనా కష్ట కాలం తీరుతుందట. అప్పుడు ఈ పురుగు మన నుంచి పారారయిపోతుందని చెబుతున్నాడు. అంతేకాదు మార్చిన కరోనా పేరును ఎక్కడపడితే అక్కడ..రోడ్లపై ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని చెబుతున్నాడు. అంతేకాదు ఎవరి ఇంటి డోర్ లపై కరోనా ఇంగ్లీష్ స్పెల్లింగ్ మార్చి రాసుకోవాలని.. గో కరోనా అని రాయడానికి బదులు ఇలా చేయాలని చెబుతున్నాడు. ఇలా చేస్తే కరోనా సంక్షోభ నుంచి గట్టెక్కువచ్చని ఈ స్టెనొగ్రాఫర్ ఛాలెంజ్ చేస్తున్నారు. అయితే ఒక్క అనంతపురం జిల్లాలోనే కాదు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా తాను చెప్పినట్లు చేస్తే కరోనా కంటికి కనిపించకుండా పోతుందని చెబుతున్నాడి సూపర్ స్టెనోగ్రాఫర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement