Wednesday, May 15, 2024

రాజు… నా బాల‌రాజు…

‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ సోహెల్‌ -టైటిల్‌ పాత్రలో శ్రీ కోనేటి దర్శకత్వంలో ఎం.డీ పాషా నిర్మిస్తున్న చిత్రం ‘బూట్‌ కట్‌ బాలరాజు’. మేఘ లేఖ, సునీల్‌, సిరి హన్మంత్‌, ఇంద్రజ ఇతర కీలక పాత్రధారులు.
తాజాగా ఈ చిత్రం నుంచి ”రాజు నా బాలరాజు…. ” పాటని హీరో విజయ్‌ ఆంటోనీ విడుదల చేసి చిత్ర యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. భీమ్స్‌ సిసిరోలియో ఈ పాటని స్వరపరిచారు. శ్యామ్‌ కాసర్ల సాహిత్యం అందించారు. స్వాతి రెడ్డి ఆలపించింది. ఈ చిత్రానికి ప్రముఖ డీవోపీ శ్యామ్‌ కె నాయుడు కెమెరా మెన్‌ గా పని చేస్తున్నారు. విజయ్‌ వర్ధన్‌ ఎడిటర్‌ కాగా విఠల్‌ కొసనం ఆర్ట్‌ డైరెక్టర్‌. సయ్యద్‌ సోహెల్‌ ర్యాన్‌, మేఘ లేఖ, సునీల్‌, సిరి హన్మంత్‌, ఇంద్రజ, అవినాష్‌, సద్దాం, ‘కొత్త బంగారు లోకం’ వివేక్‌ తదితరులు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement