Friday, April 26, 2024

సోగ్గాడే చిన్ని నాయ‌న ‘ప్రీ రిలీజ్’

సోగ్గాడే చిన్నినాయ‌న చిత్రానికి సీక్వెల్ గా బంగార్రాజు తెర‌కెక్కింది. క‌ల్యాణ్ కృష్ణ డైరెక్ట‌ర్. కాగా నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ‌, నాగ‌చైత‌న్య‌,కృతిశెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. ఈ చిత్రం ఈ నెల 14వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకి రానుంది. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. నేటి సాయంత్రం హైదరాబాద్, హైటెక్ సిటీలోని హోటల్ ట్రైడెంట్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కొంతసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు.సంక్రాంతి బరి నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ .. ‘రాధేశ్యామ్’ తప్పుకోవడంతో, ‘బంగార్రాజు’ పెద్ద సినిమాగా నిలిచింది. గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ కావడం .. పండుగకి సంబంధించిన అంశాలు కలిగిన కథ కావడం ఈ సినిమాకి కలిసొస్తుందనే టాక్ వినిపిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement