Thursday, April 25, 2024

AIMIM MLC: తెలంగాణ మండలి ప్రొటెం చైర్మన్‌గా జాఫ్రీ

తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా ఎంఐఎం ఎమ్మెల్సీ సయ్యద్‌ అమీనుల్‌ హసన్‌ జాఫ్రీని నియమితులైయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గురువారం ఆయన పొటెం చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇటీవలి వరకూ ప్రొటెం చైర్మన్‌గా వ్యవహరించిన భూపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తి కావడంతో ఆయన స్థానంలో హసన్ జాఫ్రీని నియమించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికైన వారు ప్రొటెం చైర్మన్‌ జాఫ్రీ సమక్షంలో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement