Monday, December 9, 2024

కిదాంబి శ్రీకాంత్ స‌హా ఏడుగురు భార‌త ష‌ట్ల‌ర్ల‌కు క‌రోనా

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా విజృంభిస్తోంది. రోజుకు ల‌క్ష‌ల్లో క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. అయితే తాజాగా క్రీడారంగంపై కూడా క‌రోనా పంజా విసిరింది. ఇండియా బ్యాడ్మింట‌న్ టోర్నీలో క‌రోనా క‌ల‌క‌లం చోటుచేసుకుంది. ఇండియా ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో ఏడుగురు భారతీయ షట్లర్లు కరోనా బారిన పడ్డారు. వారిలో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప, రితికా ఠక్కర్, ట్రీసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ సింగ్, ఖుషీ గుప్తాలు ఉన్నారు. ఇదే విషయాన్ని బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ లో ప్రకటించింది. ఇండియా ఓపెన్ 2022 టోర్నీలో భాగంగా కొవిడ్ టెస్టులు నిర్వహించగా అందులో ఏడుగురు కరోనా బారిన పడ్డారు. మంగళవారం వారికి నిర్వహించిన RT-PCR పరీక్షల్లో ఆటగాళ్లకు పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆ ఏడుగురు ఆటగాళ్లతో సన్నిహితంగా ఉన్న డబుల్స్ క్రీడాకారులు కూడా టోర్నీని విరమించుకున్నారని బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. టోర్నీలో కరోనా కేసులు నమోదైన కారణంగా ఇండియా ఓపెన్ 2022 నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన ఆటగాళ్లను ఐసోలేషన్ కు పంపడం సహా మిగిలిన ఆటగాళ్లకు కరోనా నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement