Monday, May 13, 2024

NZB: చిన్న సినిమాలను ఆదరించాలి… ఇందూర్ లో నరకాసుర టీమ్ సందడి

నిజామాబాద్ సిటీ, నవంబర్ 6 (ప్రభ న్యూస్) : చిన్న సినిమాలను ఆదరించాలని… నరకాసుర సినిమా సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు దర్శకుడు సెబాస్టియన్ కృతజ్ఞతలు తెలిపారు. నరకాసుర మూవీకి అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా సక్సెస్ మీట్ అయిన నేపథ్యంలో నరకాసుర మూవీ టీమ్ ఇందూర్ లో సందడి చేశారు. రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరో హీరోయిన్స్ గా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందు కొచ్చింది నరకాసుర సినిమా. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు.

నిజామాబాద్ నగరంలోని వంశీ ఇంటర్నేషనల్ లో ఏర్పాటు చేసిన నరకాసుర సినిమా సక్సెస్ మీట్ లో విలేకరులతో దర్శకుడు సెబాస్టియన్ మాట్లాడుతూ… త‌మ నరకాసుర సినిమాను పెద్ద హిట్ చేసిన ఆడి యెన్స్ కు థ్యాంక్స్ చేపారు. సినిమా చూసిన వాళ్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. మీడియా రివ్యూస్ చాలా పాజిటివ్ గా ఉన్నాయని కొందరు పర్సనల్ గా త‌నకు సినిమా ఆకట్టుకుందని మెసేజ్ లు పంపుతున్నారని తెలిపారు. సినిమా బాగుందని చెప్పడమే కాదు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, యాక్టర్స్ పర్ ఫార్మెన్స్, ఫైట్స్, ఇలా ప్రతి క్రాఫ్ట్ వర్క్ బాగుందని ప్రశంసలు వస్తున్నాయన్నారు. ఈ మూవీ జర్నీలో త‌నకు సపోర్ట్ చేసిన త‌మ ప్రొడ్యూసర్, ఇతర టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పారు.


నరకాసుర చూడని వాళ్లు థియేటర్స్ కు వెళ్లండి..
నరకాసుర చూడని వాళ్లు థియేటర్స్ కు వెళ్లండి, ఈ సినిమాలోని మంచి మెసేజ్ ను ఇతరులకు చెప్పండని నిర్మాత డాక్టర్ అజ్జా శ్రీనివాస్ అన్నారు. “నరకాసుర మూవీతో మా బ్యానర్ సుముఖ క్రియేషన్స్ కు మంచి పేరొచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా మంచి మూవీ చేశారంటూ ప్రశంసిస్తున్నారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయని అంటున్నారు. రక్షిత్ తో పాటు హీరోయిన్స్, ఇతర కీ ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుందని అభినందిస్తున్నారని తెలిపారు.. మా సంస్థలో గుర్తుండిపోయే సినిమా చేసిన డైరెక్టర్ సెబాస్టియన్ కు థ్యాంక్స్” అని అన్నారు.

- Advertisement -


సినిమాకు మీరు చూపిస్తున్న ఆదరణకు థ్యాంక్స్…
హీరోయిన్ అపర్ణ జనార్థన్ మాట్లాడుతూ… ప్రేక్షకుల ఆదరణ వల్లే మేము ఈ వేదిక మీద ఉండగలిగాం. నరకాసుర సినిమాకు మీరు చూపిస్తున్న ఆదరణకు థ్యాంక్స్ అన్నారు. హీరోయిన్ సంగీర్తన విపిన్ మాట్లాడుతూ… నరకాసుర మూవీకి థియేటర్స్ లో హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. త‌మ మూవీ సూపర్ హిట్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఈ జర్నీ మాకెంతో స్పెషల్. కష్టపడిన సినిమాకు తప్పకుండా ఫలితం దక్కుతుంది అనేందుకు మా నరకాసుర మూవీ లేటెస్ట్ ఎగ్జాంపుల్. నాకు ఈ సినిమా జర్నీలో సపోర్ట్ చేసిన టీమ్ కు థ్యాంక్స్. నరకాసుర మూవీ చూడని వారు థియేటర్స్ కు వెళ్లమని కోరుతున్నాని చెప్పింది.

రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్, శతృ, నాజర్, చరణ్ రాజ్, తేజ చరణ్ రాజ్, శ్రీమాన్, గాయత్రి రవిశంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి బ్యానర్స్ సుముఖ క్రియేషన్స్ అండ్ ఐడియల్ ఫిల్మ్ మేకర్స్, నిర్మాత డాక్టర్ అజ్జా శ్రీనివాస్, సహ నిర్మాత కారుమూరు రఘు, ఎడిటింగ్ సిహెచ్ వంశీకృష్ణ, సినిమాటోగ్రఫీ నాని చమిడిశెట్టి, సంగీతం ఏఐఎస్ నాఫాల్ రాజా, యాక్షన్ రోబిన్ సుబ్బు, కొరియోగ్రఫీ పొలాకి విజయ్, లిరిక్స్ వడ్డేపల్లి కృష్ణ, పిఆర్ఓ జీఎస్ కే మీడియా, రచన, డైరెక్షన్ సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ లుగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement