Tuesday, May 14, 2024

స్లిమ్ గా మోక్ష‌జ్ఞ‌- టాలీవుడ్ ఎంట్రీ ఖాయ‌మా

ఎప్ప‌టి నుండో హీరో బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తాడ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ కాస్త బొద్దుగా ఉండ‌టంతో ఇప్ప‌టి వ‌రకు మోక్ష‌జ్ఞ టాలీవుడ్ ఎంట్రీ జ‌ర‌గ‌లేదు. కాగా రీసెంట్ గా మోక్ష‌జ్ఞ ఫొటో ఒక‌టి వైర‌ల్ గా మారింది.
నిన్న మొన్నటి వరకు మోక్షజ్ఞ… బొద్దుగా ఉండే వాడు. ఇప్పుడు ఒక్కసారిగా స్లిమ్ లుక్ లోకి మారిపోయారు. మోక్షజ్ఞ స్టైలీష్ లుక్ లో దర్శనం ఇచ్చారు. ఇతని లుక్ కు నెటిజన్స్ అయితే ఫిదా అయిపోతున్నారు. మరో యంగ్ సింహం వచ్చేస్తుందని అంటున్నారు. మోక్షజ్ఞ తన స్నేహితులతో కలిసి కనిపించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

స్లిమ్ గా కనిపించడమే కాకుండా హ్యాండ్సమ్ లుక్ లో కూడా ఉన్నాడు.నందమూరి కుటుంబ వారసుడిగా ఎంట్రీ ఇవ్వనున్న మోక్షజ్ఞ.. అందరి అంచనాలను సైతం అందుకోవాలి. అందుకోసమే ఇలా స్టైలీష్ లుక్ లోకి మారిపోయారని తెలుస్తోంది.ఇక లెజెండరీ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిత్య 369 సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో గుర్తుండి పోయే సినిమా. ఆయనకు మంచి పేరును తీసుకువచ్చింది. అయితే ఈ సినిమాను సీక్వెల్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.ఆదిత్య 999 పేరుతో మోక్షజ్ఞను లెజెండరీ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాసరావు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.ప్రస్తుతానికి అయితే మోక్షజ్ఞ… ఆదిత్య 369 సిక్వేల్ లో చేస్తాడా లేదా అనేది క్లారిటీ లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement