Wednesday, May 15, 2024

స్కంద సెకండ్ సింగిల్ రిలీజ్.. చిందులేయిస్తోన్న ‘‘గందరాబాయి’’

బోయపాటి శ్రీను డైరెక్ష‌న్ లో రామ్ పోతినేని చేస్తోన్న పాన్ ఇండియన్ సినిమా స్కంద. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో రామ్ పోతినేనికి జోడీగా శ్రీలీల హీరోయిన్ గా క‌నిపించ‌నుంది. కాగా, ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట ప్రొడక్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. ఇక మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇటీవ‌ల రిలీజ్ చేసిన ‘‘నీ చుట్టు’’ అనే ఫ‌స్ట్ సింగిల్‌కి ఆడియ‌న్స్ నుండి సాలిడ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు అదే హైప్ ను కొనసాగించడానికి మూవీ నుండి సెంకండ్ సింగిల్ కి సంబందించిన లిరికల్ సాంగ్ ఇవ్వాల సాయంత్రం కొద్ది సేప‌టి క్రితం రిలీజ్ చేసారు మేకర్స్.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి స్కంద చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement