Monday, April 29, 2024

Singam-3 | షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ అజ‌య్ దేవ్‌గ‌ణ్.. కంటికి తీవ్ర గాయం

బాలీవుడ్ హీరో అజయ్‌ దేవ్‌గణ్ సింగం మూవీ సిరీస్‌లో మరో సినిమా రాబోతుంది. మొద‌టి రెండు సినిమాలు ఘ‌న విజ‌యాలు అందుకోవ‌డంతో సింగం 3ని తెరకెక్కిస్తున్నారు. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం ముంబైలో జ‌రుగుతోంది. అయితే ఈ సినిమా సెట్స్‌లో హీరో అజయ్ దేవ్‌గణ్ కా గాయప‌డిన‌ట్టు తెలుస్తొంది.

మూవీలో ఓ ఫైటింగ్ సన్నివేశాన్ని చిత్రీక‌రిస్తుండ‌గా అనుకోకుండా అజయ్‌ దేవ్‌గణ్ గాయ‌ప‌డ్డాడు. అత‌డి క‌న్నుకు గాయ‌మైన‌ట్లు తెలుస్తోంది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన మూవీ యూనిట్ డాక్ట‌ర్‌ను పిలిపించారు. అజ‌య్ దేవ్‌గ‌ణ్ త‌న కంటికి చికిత్స చేయించుకున్నాడు. అయితే, కొద్ది సేపు విశ్రాంతి అనంత‌రం తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తొంది.

ఇక‌, సింగం 3 సినిమాలో క‌రీనా క‌పూర్‌, దీపికా ప‌దుకొనే, ర‌ణ్‌వీర్ సింగ్‌, అక్ష‌య్ కుమార్‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా 2024 అక్టోబ‌ర్ 15న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement