Saturday, April 27, 2024

శింబు లైఫ్ ఆఫ్ ముత్తు.. ఓటీటీలో స్ట్రీమింగ్ తేదీ & ప్లాట్‌ఫామ్ ఏదంటే?

గౌతమ్ మీనన్, శింబు కాంబినేష‌న్ లో రీసెంట్ గా వ‌చ్చిన మూవీ ‘వెందు తానింధతు కాదు’ తెలుగు వ‌ర్షెన్ లో ‘లైఫ్ ఆఫ్ ముత్తు’గా ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 15న థియేట‌ర్ల‌లో విడుదలై ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రంలో సిలంబరసన్ టి.ఆర్. (STR), సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలు పోషించారు.

కాగా, ఈ సినిమా శాటిలైట్ హక్కులను కలైంజర్ టీవీ, డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నాయి. తాజా సమాచారం ఏమిటంటే ఈ మూవీ అక్టోబర్ 13వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్​ కానుంది. దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 21న OTTలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ అనుకున్నారు.. కానీ, మూవీ ఓటీటీని రిలీజ్ ని ప్రీపోన్ చేసి 13వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. మూవీలో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటలు కూడా ఆదరణ పొందాయి. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ డెబ్యూ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో సీక్వెల్‌ని ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement