Friday, April 26, 2024

బిగ్‌బాస్ షో నిలిపివేయాలన్న పిటిషన్ పై విచార‌ణ ఈనెల 27కి వాయిదా

బిగ్‌బాస్ షోలో ఐబీఎఫ్ గైడ్ లైన్స్ ను నిర్వాహకులు పాటించలేదని, అదేవిధంగా బిగ్‌బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ షో నిలిపివేయాలన్న పిటిషన్ పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ హైకోర్టులో విచారణ జరిగింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది. గత విచారణలో బిగ్ బాస్ షోపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 1970లలో వచ్చిన సినిమాల విషయాన్ని ప్రస్తావిస్తూ పలు కామెంట్లు చేసింది. ఈ కేసులో కేంద్రం తరపు న్యాయవాది తన స్పందనకు కొంత సమయం కోరారు. ఈ క్రమంలో ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం. కేంద్రం వాదనలను ఈనెల 27న వింటామని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement