Saturday, April 27, 2024

Devara : దేవ‌ర తొలి పార్ట్ షూటింగ్ పూర్తి..

అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు, బాలీవుడ్ ప్రముఖ నటి జాన్వీ కపూర్ ‘దేవర’ సినిమాతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాలోనే ఏకంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించేఅవకాశం దక్కించుకుందీ అందాల తార. దేవర’ సినిమాలో జాన్వీ రెండు షేడ్స్ ఉన్న‌పాత్ర‌లో న‌టిస్తున్న‌ది. మొదటి భాగంలో ఆమె తంగం సముద్రయాన యువతి పాత్రలో కనిపించనుంది.

తాజాగా దేవర సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చింది నటి జాన్వీ కపూర్. ‘దేవర’ సినిమాలో తన షూటింగ్ పార్ట్‌ పూర్తి చేసుకుంది.ఈ మేరకు తన పాత్ర షూటింగ్ పూర్తయిందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది జాన్వీ కపూర్. తాజాగా దేవర సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చింది నటి జాన్వీ కపూర్. ‘దేవర’ సినిమాలో తన షూటింగ్ పార్ట్‌ పూర్తి చేసుకుంది. ఈ మేరకు తన పాత్ర షూటింగ్ పూర్తయిందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది జాన్వీ కపూర్. ‘దేవర’ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుండగా, ప్రస్తుతం మొదటి భాగం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా రెండో భాగం షూటింగ్‌లో జాన్వీ తంగం పాత్రలో నటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement