Friday, May 17, 2024

Sivaji | రీ-రిలీజ్‌కి రెడీ అవుతున్న ‘శివాజీ ది బాస్’.. రజినీ బర్త్‌డే గిఫ్ట్‌గా థియేటర్లలోకి !

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిన తెరకెక్కించిన మొదటి సినిమా ‘శివాజీ ది బాస్’. 2007లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. కాగా ఈ సినిమా ఇప్పుడు 4K ప్రింట్ తో రీ రిలీజ్ కి సిద్ధం రడీ అవుతోంది. డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టినరోజు జ‌రుపుకోనుండ‌గా.. బర్త్ డే కంటే ముందే డిసెంబర్ 9న థియేట‌ర్ల‌లో అడుగు పెట్టనుంది.

శ్రియా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. హీరో సుమన్ విలన్ గా కనిపించాడు. సినిమా చివరిలో రజిని గుండు గెటప్ లో ఎంట్రీ ఇచ్చి, తన డిఫరెంట్ మ్యానరిజమ్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం సూపర్ హిట్టుగా నిలిచింది. సుమారు 90 కోట్ల బడ్జెట్ తో ఏవిఎం ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 160 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని రికార్డులు సృష్టించింది. అలాగే స్టేట్ నుంచి నేషనల్ వైడ్ ఎన్నో అవార్డులు కూడా అందుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement