Monday, April 29, 2024

ఒకే ఒక జీవితం…అంటున్న శర్వానంద్

చెప్పినట్టుగానే శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు. శర్వానంద్ కెరీర్లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒకే ఒక జీవితం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రీతు వర్మ నటిస్తోంది. అలాగే డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను ఈ చిత్రం జరుపుకుంటోంది.

ఇక వీటితో పాటు శర్వానంద్ మహాసముద్రం సినిమాలో నటిస్తున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు శర్వానంద్.

Advertisement

తాజా వార్తలు

Advertisement