Thursday, May 2, 2024

శంకర్ ఫుల్ ఫోకస్ చెర్రీపైనేనట ?

సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా కన్నా ముందు శంకర్ భారతీయుడు 2 సినిమా చేయాల్సి ఉంది.

కాగా అది వివాదాలతో ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం శంకర్ ఫుల్ ఇంట్రెస్ట్ మొత్తం రాంచరణ్ సినిమాపైనే ఉందట. ప్రస్తుతానికైతే భారతీయుడు-2 సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు కంప్లీట్ చేయాలి అనే దానిని పక్కన పెట్టాడట శంకర్. మరి చరణ్ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement