Friday, April 26, 2024

మరో సీనియర్ నటి మృతి

సినీ ఇండస్ట్రీ మరో నటిని కోల్పోయింది. ప్రముఖ కన్నడ నటి బి.జయ అనారోగ్యంతో కన్నుమూశారు. బెంగళూరు లోని కరుణశ్రమ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జయ వయసు 75 సంవత్సరాలు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో పాత్రలు చేశారు. థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి 1958 భక్త ప్రహ్లాద చిత్రంలో సినీ రంగంలో అడుగు పెట్టారు.

రాజ్ కుమార్, కళ్యాణ్ కుమార్, ఉదయ్ కుమార్, బాలకృష్ణ వంటి తొలితరం నటులతో ఆమె నటించారు. 2004-05లో గౌడ్రు మూవీతో ఉత్తమ సహాయ నటిగా అవార్డును గెలుచుకున్నారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement