Sunday, April 28, 2024

200 మిలియన్ల వ్యూస్ సాధించిన సారంగదరియా !!

అక్కినేని నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లవ్ స్టొరీ. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరికి సంబంధించిన పాటలు, లుక్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. అందులో ముఖ్యంగా సారంగదరియా పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ పాట సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది. తాజాగా 200 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రాయగా మంగ్లీ పాడారు. ఫిబ్రవరి 28న రిలీజ్ అయిన ఈ పాట 14 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్ ను సాధించి అప్పట్లో రికార్డ్ క్రెయేట్ చేసింది. ఇక నారాయణ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement