Thursday, May 2, 2024

సారంగదరియా అస్సలు తగ్గట్లేదు!!

ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది సాయి పల్లవి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత సాయి పల్లవికి వరుస అవకాశాలు వచ్చాయి. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి నటిస్తుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ముఖ్యంగా సారంగదరియా పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సాంగ్ 250 మిలియన్ ల వ్యూస్ ను దాటి మరో రికార్డును క్రియేట్ చేసింది. ఈ లిరికల్ వీడియో సాంగ్ లిరిక్స్, మ్యూజిక్ తో పాటు మంగ్లీ స్వరం, సాయి పల్లవి డాన్స్ హైలెట్ గా నిలిచాయి. రిలీజ్ అయి చాలా రోజులు అవుతున్నా… సోషల్ మీడియాలో ఈ పాట జోరుగా మాత్రం తగ్గట్లేదు. ఇకపై ఈ సాంగ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement