Wednesday, May 1, 2024

ఏపీలో మరింత తగ్గిన కరోనా కేసులు…కొత్తగా ఎన్నో తెలుసా ?

ఏపీలో కరోనా వ్యాప్తి క్రమేణా తగ్గుతూ వస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 74,453మందికి కరోనా ప‌రీక్ష‌లు చేయ‌గా 4,169 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో 8,376మంది క‌రోనా నుంచి కొలుకున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 53మంది మ‌ర‌ణించారు. ఇక ప్ర‌స్తుతం ఏపీలో 53,880యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 18,57,352 కు చేరింది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు 17,91,056మంది క‌రోనా నుంచి కొలుకున్నారు. అంతే కాకుండా 12,416 మంది కరోనా తో మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement