Wednesday, May 1, 2024

ఓటీటీలోకి వ‌చ్చేసిన ప్రేమ్ కుమార్.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే !

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ప్రేమ్ కుమార్’. అభిషేక్ మహర్షి దర్శకత్వంలో ఈ ఏడాది ఆగస్టు 18న థియేటర్లలో రిలీజ్ అయింది ఈ మూవీ. ఈ సినిమాలో సంతోష్ తన కామెడీ టైమింగ్‍తో మరోసారి మెప్పించాడు. కాగా, ఇప్పుడు ఈ ‘ప్రేమ్ కుమార్’ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.

ఇక ఈ సినిమాలో సంతోష్ శోభన్‍ సరసన రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించారు. సుదర్శన్, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, అశోక్ కుమార్, శ్రీవిద్య కీలకపాత్రల్లో నటించారు. అనంత్ శ్రీకర్ సంగీతం అందించ‌గా.. సారంగ క్రియేషన్స్ పతాకంపై శివప్రసాద్ పన్నీరు నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement