Monday, April 29, 2024

ఇంగ్లాండ్ లో స‌మంత‌.. బ్లాక్ డ్రెస్ లో అదిరిన లుక్

బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో మెరిసింది స్టార్ హీరోయిన్ స‌మంత‌. కాగా సిటాడెల్ వరల్డ్ ప్రీమియర్ షో ప్రదర్శన కోసం ఇంగ్లాండ్ వెళ్లింది. సిటాడెల్ టీమ్ రాజ్ అండ్ డీకే, హీరో వరుణ్ ధావన్ లతో పాటు సమంత ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. సిటాడెల్ ఇంటెర్నేషనల్ సిరీస్. ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. ఇంటర్నేషనల్ ప్రీమియర్ కి ఆమె హాజరయ్యారు. సమంత నటిస్తున్న సిటాడెల్ సిరీస్ చిత్రీకరణ దశలో ఉంది. సిటాడెల్ వరల్డ్ ప్రీమియర్ ఈవెంట్ కి సమంత సూపర్ స్టైలిష్ గా తయారయ్యారు. ఇంటెర్నేషనల్ ఈవెంట్ కి మ్యాచ్ అయ్యేలా బ్లాక్ డిజైనర్ వేర్ ధరించారు.

సమంత లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. చిత్ర ప్రముఖులు సమంత ఫోటోలపై అభిప్రాయం వెల్లడిస్తున్నారు. ఇక దేశం మారగానే సమంత వేషం మార్చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో సమంత తెల్లని వస్త్రాలలో కనిపించారు. చీర కట్టి, చేతిలో జపమాల పట్టి చాలా సాదాసీదాగా, ప్రశాంతమైన లుక్ మైంటైన్ చేశారు. సిటాడెల్ ప్రీమియర్ షోలో దానికి పూర్తి భిన్నంగా ఆమె పాల్గొన్నారు. ప్రస్తుతం సమంత సిటాడెల్ తో పాటు విజయ్ దేవరకొండ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ ఖుషి టైటిల్ తో ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నారు. ఖుషి చిత్రీకరణ చివరి దశకు చేరింది. సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా కాలం తర్వాత సమంత లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement