Thursday, May 16, 2024

ఖుషీ – స‌మంత ఫ‌స్ట్ లుక్

నటి సమంత వైవిధ్య పాత్ర ల్లో నటిస్తోంది. విమెన్‌ సెంట్రిక్‌ మూ వీస్‌తోనూ ఆకట్టు-కుంటోంది. ఇటీవలే వచ్చిన యశోద, శాకుంతలం చిత్రాల్లో తన నటనతో మెప్పించింది. త్వరలోనే ‘ఖుషీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత ఏడాది రావాల్సిన సినిమా ఇది. కానీ సమంత అనారోగ్య సమస్యల వల్ల ఆలస్యమైంది. విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. లే-టె-స్ట్‌గా సమంత బర్త్‌ డే సంద ర్భంగా ‘ఖుషీ’ నుంచి కొత్త పోస్టర్‌ విడుదల చేసింది చిత్ర బృందం. చూడగానే ఆకట్టు-కునేలా ఉన్న ఈ స్టిల్‌లో సమంత ఐడి కార్డ్‌ వేసుకుని ఏదో సాప్ట్‌n వేర్‌ ఆఫీస్‌లోకి వెళుతున్నట్టు-గా ఉంది. తన లుక్‌ బర్త్‌ డే మూడ్‌కు తగ్గ ట్టు-గా చాలా జాయ్‌ ఫుల్‌ గా కనిపిస్తోంది. ఈ సందర్భంగా తనకు విజయ్‌ దేవరకొండతో పాటు- పలువురు సినీ ప్రముఖులు బర్త్‌ డే విషెస్‌ చెబుతూ పోస్టర్‌ ను అభినందిస్తున్నారు.
ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంటోన్న ‘ఖుషీ’ చిత్రాన్ని ఈ యేడాది సెప్టెంబర్‌ ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement