Monday, May 20, 2024

ఎం1 ఎక్సేంజ్ తో కలసి పనిచేయనున్న మాస్టర్‌కార్డ్

రైతులకు, రైతు ఉత్పత్తి సంస్థలకు (ఎఫ్ పీఓలు), అగ్రి-ఎంఎస్ఎంఇ లకు తన అధునా తన అగ్రిటెక్ వేదిక ఫామ్ పాస్ ద్వారా డిజిటల్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ పరిష్కారాన్ని అందించడానికి ఎం1 ఎక్సేంజ్ తో కలసి పని చేయనున్నట్లు మాస్టర్‌కార్డ్ ప్రకటించింది. ఈసందర్భంగా ఎం1 ఎక్సేంజ్ సీఈఓ సందీప్ మొహింద్రు మాట్లాడుతూ… ఎం1 ఎక్సేంజ్ ట్రేడ్స్ లోని ఫైనాన్షియర్‌ల పెద్ద నెట్‌వర్క్ ఫామ్ పాస్ ప్లాట్‌ఫామ్‌లో కొనుగోలుదారులు, అమ్మకందారుల కోసం లిక్విడిటీ ప్రవాహాన్ని మెరుగు పరుస్తుందన్నారు. క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా చివరి అంచె కస్టమర్‌ల కోసం ఎఫ్ పిఓలు సేకరించిన ఇన్వా యిస్‌లను డిస్కౌంట్ చేసే ఒక ప్రత్యేకమైన ప్రతిపాదనను ట్రెడ్స్ అందిస్తుందన్నారు.

మాస్టర్ కార్డ్ దక్షిణాసియా సీఓఓ వికాస్ వర్మ మాట్లాడుతూ… రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా అధికారిక రుణాల ప్రాప్యత ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్నారు. ఎం1 ఎక్సేంజ్ సహకారంతో ఎంఎస్ఎంఈలు, ఎఫ్ పిఓలు, వ్యాపారులు, రైతులను ఒకే ప్లాట్‌ఫామ్‌పై ఒకచోట చేర్చి వారి వర్కింగ్ క్యాపిటల్, క్రెడిట్ అవసరాలను ఇన్వాయిస్ డిస్కౌంట్ సొల్యూషన్ ద్వారా పరిష్కరించాలని మాస్టర్ కార్డ్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఫార్మ్ పాస్ ప్లాట్‌ఫామ్‌లో సురక్షితమైన, సమ్మతించిన డేటాను అది వినియోగించుకోనుందన్నారు. ఈ ఉత్పాదన 10 మిలియన్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement