Saturday, June 15, 2024

Saindhav | సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న వెంకటేష్ సైంధవ్

వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ పాన్ ఇండియన్ మూవీ ‘సైంధవ్’. ఈ మూవీ పై మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై వెంకట్ బోయినపల్లి నిర్మించగా కీలక పాత్రల్లో ఆండ్రియా, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, ముఖేష్ రుషి నటించారు.

ఇవ్వాల ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా దీనికి సెన్సార్ బోర్డు యు / ఏ సర్టిఫికెట్ ని కేటాయించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన సైంధవ్ కి ఎస్ మణికందన్ ఫోటోగ్రఫి అందించారు. మరి రిలీజ్ అనంతరం సైంధవ్ ఏ రేంజ్ సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement