Tuesday, October 22, 2024

Mangalagiri – నేటి టిడిపి కేంద్ర కార్యాల‌యానికి చంద్ర‌బాబు…

అమ‌రావ‌తి – ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే మంత్రులకు శాఖలు కేటాయించారు.. ఆ బాధ్యతలను స్వీకరించే పనిలో మంత్రులు ఉండగా అధికారులతో వివిధ అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.. మరోవైపు పార్టీపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్ట‌నున్నారు.. అందులో భాగంగా ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు చంద్రబాబు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్లడం ఇదే తొలిసారి.. ఇకపై తరుచూ పార్టీ కార్యాలయానికి వెళ్లేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోనున్నారు. అలాగే . పార్టీ కార్యాలయంలో మంత్రులు కూడా అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించనున్నారని అంటున్నారు. ప్రభుత్వానికి-పార్టీకి మధ్య గ్యాప్ రాకుండా ఉండేలా చంద్రబాబు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు.. పార్టీ-ప్రభుత్వం సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు చంద్రబాబు …

Advertisement

తాజా వార్తలు

Advertisement