Tuesday, July 9, 2024

AP: రోడ్డుప్రమాదం.. ముగ్గురు యువకులు స్పాట్ డెడ్

చిత్తూరు జిల్లా చెర్లోపల్లిలో లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ముగ్గురు యువకులు పవన్, మంజు, చరణ్ బైక్‌పై వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టారు. దీంతో ముగ్గురు యువకులు రోడ్డుపై ఎగిరిదూరంగా పడ్డారు. పడిన వెంటనే యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముగ్గురు యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తీశారు. రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement