Friday, July 12, 2024

TS: భైంసా ఘటనపై న్యాయవిచారణ జరిపించాలి… బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు

బాధితులపైనే అక్రమ కేసులు శోచనీయం
ఆంధ్రప్రభ బ్యూరో ఆదిలాబాద్ : హిందువులపై ఒక వర్గం వారు దాడులు చేస్తే నిందితులపై కేసు నమోదు చేయకుండా పోలీసులు ఉద్దేశపూర్వకంగా బాధితులపై అక్రమ కేసులు బనాయిస్తూ జైలుకు పంపుతున్నారని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పటేల్ ఆరోపించారు. శనివారం ఆదిలాబాద్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ నగేష్ మాట్లాడుతూ… భైంసాలో ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా హిందువులను టార్గెట్ గా చేసుకొని ఉద్దేశపూర్వకంగా 23మంది హనుమాన్ భక్తులపై కేసు నమోదు చేసి జైలుకు పంపారన్నారు.

ఇప్పటివరకు హనుమాన్ భక్తులకు బెయిల్ కూడా రాలేదన్నారు. ఇటీవల జైనూర్ లోను ఒక వర్గం వారు దాడులు చేసినా వారిపై ప్రభుత్వం ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం శోచనీయమన్నారు. ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ రామారావు పటేల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒక వర్గం వారికి వత్తాసు పలుకుతూ మెజార్టీ వర్గం హిందువులపై అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. త్వరలోనే డీజీపీని కలిసి పరిస్థితి నివేదిస్తామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు ఆదినాథ్, కృష్ణ, జోగు రవి లాలమున్న, కామన్ విట్టల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement