Saturday, May 4, 2024

బాలయ్య కూతురుగా రౌడీ బేబీ ?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా బిబి3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సింహా లెజెండ్ చిత్రాలు తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రొర్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా మరోవైపు బాలయ్య వేరే కథలను కూడా వింటున్నాడట.తాజాగా ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ బాలయ్యకు పిచ్చపిచ్చగా నచ్చిందట.

సినిమా మొత్తం తన కూతురు చుట్టూ ఉండబోతుందట. తండ్రిని కాపాడటం కోసం కుమార్తె పోరాడే కథే ఇదట. అయితే ఆ కుమార్తె పాత్రలో సాయి పల్లవి అయితే బాగుంటుందని బాలయ్య, డైరెక్టర్ భావిస్తున్నారట. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరపగా కథంతా విన్నాక చెబుతానని చెప్పిందట. అన్ని ఓకే అయితే బాలయ్య కూతురిగా సాయి పల్లవి ఓకే అయినట్లే.

Advertisement

తాజా వార్తలు

Advertisement