Sunday, May 19, 2024

Sai Pallavi | సత్యసాయి సన్నిధిలో సాయి పల్లవి

స్టార్ హీరోయిన్, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బలమైన పాత్ర, ప్రాధాన్యత ఉంటే తప్ప ఆమె సినిమా చేయదు. సాయి పల్లవి నటిస్తున్నారంటే ఆ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉంటుందని అనుకునేలా ఆమె పేరు తెచ్చుకున్నారు. సాయి పల్లవి అందం, అభినయంతో పాటు ఆమె సింప్లిసిటీని కూడా చాలా మంది తెగ ఇష్టపడతారు. సాయి పల్లవికి ఆధ్యాత్మిక కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

అందుకే కొత్త సంవత్సర వేడుకలను కూడా ఆమె అదే రీతిలో జరుపుకున్నారు. కొత్త సంవత్సరం 2024లోకి అడుగిడిన‌ వేళ పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా ఆలయం ‘ప్రశాంతి నిలయం’లో జరిగిన ఆధ్యాత్మిక వేడుకల్లో సాయి పల్లవి పాల్గొన్నారు. చక్కనైన చీర కట్టు, నిదుటన బొట్టుతో సంప్రదాయబద్ధంగా ఆమె భజనలో పాల్గొన్నారు. కొత్త సంవత్సర సందర్భాన్ని దేవుడి సన్నిధిలో ఆధ్యాత్మికతతో జరుపుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement