Saturday, May 11, 2024

మార్చి 27న రామ్ చరణ్ ఉగ్రరూపం..

మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఆ సందర్భంగా రామరాజు కొత్త పోస్టర్ ను విడుదల చేసేందుకు ఆర్ఆర్ఆర్ చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఆ రోజున రామ్ చరణ్ మహోగ్రరూపాన్ని చూస్తారని చిత్రయూనిట్ వెల్లడించింది. రామరాజు వస్తున్నాడు… అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఆ ట్వీట్ను చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు ట్వీట్ పెట్టీపెట్టగానే లైకులు, షేర్లు, కామెంట్లతో రచ్చ చేస్తున్నారు అభిమానులు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్-అలియా భట్, ఎన్టీఆర్- ఒలీవియా మోరిస్ జంటలుగా నటిస్తుండగా, కీలకపాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement