Sunday, April 28, 2024

చిట్టికి ఆఫర్స్ కుమ్మేస్తున్నాయట !!

ఇటీవల కాలంలో చిన్న సినిమాలు.. పెద్ద సినిమాల కన్నా ఘన విజయం సాధిస్తున్నాయి. ఏ సినిమా విజయం సాధిస్తుందో ఏ సినిమా బోల్తా కొడుతుందో చెప్పటం చాలా కష్టం. ఇక ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాతిరత్నం చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడంతో పాటు… కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతోంది.

ఈ సినిమా నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, దర్శకుడు అనుదీప్ కు మంచి పేరు తీసుకువచ్చింది. అలాగే ఈ నలుగురు తో పాటు ఈ సినిమాలో చిట్టి గా నటించిన ఫరియా అబ్దుల్లా కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. దీనితో తెలుగు సినిమాలలో వరుస అవకాశాలు వస్తున్నాయట. ఇదే విషయంపై ఫరియా అబ్దుల్లా స్పందిస్తూ జాతి రత్నాలు సినిమాతో చిట్టికి ఇంతటి పేరు వస్తుందని ఏమాత్రం ఊహించలేదంటోంది.మరి ఫ్యూచర్ లో ఎలాంటి సినిమాలతో చిట్టి వస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement