Tuesday, May 7, 2024

జగన్ పై వర్మ సినిమా…. టైటిల్ ఇదే ?

ఒకానొక సమయంలో సూపర్ డూపర్ హిట్ సినిమాలను చేసిన రాంగోపాల్ వర్మ… ఇప్పుడు వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. నిత్యం ఏదో ఒక వివాదం పై సోషల్ మీడియా వేదికగా రకరకాల పోస్ట్ లు పెడుతూ కాంట్రవర్సీ చేస్తూ ఉంటాడు. గతంలో ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ఎపిసోడ్ ను సినిమాగా తీసి రాజకీయాల్లో దుమారం లేపాడు. అంతకుముందు వంగవీటి టైటిల్ తో కూడా సినిమా చేసి హాట్ టాపిక్ గా మారాడు. ఆ తర్వాత బూతు సినిమాలను కూడా తెరకెక్కించాడు.

ఇప్పుడు తాజాగా ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ జగమొండి అనే టైటిల్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి నిర్మాత గా కడప జిల్లాకు చెందిన మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అయిన ఓ నాయకుడి కుమారుడు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. జగన్ ఎంత మొండి వాడో ఈ చిత్రంలో చూపించనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా తన పదవి కోసం.. కాంగ్రెస్ తో విభేదాలు పార్టీ నుంచి బయటకు రావడం.. తర్వాత జరిగిన పరిణామాలను ఆర్జీవీ చూపించనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement