Friday, April 26, 2024

ఆర్‌జీవి దెయ్యం … 16న వచ్చేస్తుంది

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ… ఇటీవల కాలంలో కాంట్రవర్షికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఇక లాక్ డౌన్ సమయంలో ఓటీటీ వేదికగా నగ్న, క్లైమాక్స్ వంటి చిత్రాలను తెరకెక్కించి రచ్చరచ్చ చేశారు. అయితే తాజాగా మరోసారి హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వర్మ.

ఈ సినిమాతో ఎలాగైనా సరే హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. ఇక ఈ సినిమాకు ఆర్జివి దెయ్యం పేరు తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రధానపాత్రలో రాజశేఖర్ నటిస్తున్నారు. స్వాతి దీక్షిత్, తనికెళ్ల భరణి, అనితా చౌదరి, బెనర్జీ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

కాగా ఈ సినిమాను ఈ నెల 16వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. కాగా ప్రమోషన్ లో భాగంగా ఆర్జివి మాట్లాడుతూ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాము. స్వాతి దీక్షిత్ ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు పాత్రలో నటించింది. అయితే ఈ పాత్ర కోసం మేకప్ లేకుండా రాజశేఖర్ నటించారని ప్రేక్షకులు అందరూ ఎంజాయ్ చేసే సినిమా అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement