Saturday, May 11, 2024

రేపే అయ‌లాన్.. క్రేజీ అప్ డేట్

హీరో శివ‌కార్తికేయ‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌య‌మే.కాగా ఆర్‌ రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం అయలాన్ లో హీరోగా న‌టిస్తున్నాడు.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్‌ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా మేకర్స్‌ కొత్త అప్‌డేట్ అందించారు. మా కష్టమంతా పెట్టి, ఎన్నో అడ్డంకులు దాటుకుని సినిమా చేశాం. అన్ని సమస్యలను దాటుకుని రేపు అయలాన్‌కు సంబంధించి భారీ ప్రకటన చేయబోతున్నాం. ఏప్రిల్‌ 24న ఉదయం 11:04 గంటలకు క్రేజీ అప్‌డేట్ రాబోతుందని కేజేఆర్‌ స్టూడియోస్‌ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాపై రేపు ఎలాంటి ప్రకటన ఉండబోతుందోనని ఎక్జయిటింగ్‌కు లోనవుతున్నారు మూవీ లవర్స్‌. ఈ మూవీలో శరద్‌ కేల్కర్‌, ఇషా కొప్పికర్‌, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్‌, బాల శరవణన్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు మ‌డొన్నే అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న మావీరన్ లో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగులో మ‌హావీరుడు టైటిల్‌తో తెర‌కెక్కుతోంది. స్టార్ డైరెక్టర్‌ శంక‌ర్ కూతురు అదితి శంక‌ర్ హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్‌ నటుడు సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement