Friday, May 3, 2024

Regina:

సుధీర్ బాబు హీరోగా వచ్చిన ఎస్‌ఎంఎస్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు రెజీనా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తక్కువ సమయంలోనే చిన్న హీరోల సినిమాలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా నిలిచిన రెజీనా స్టార్‌ హీరోల సినిమాల్లో కూడా అడపా దడపా నటిస్తూ ఇన్నాళ్ల సినీ కెరీర్ ను నెట్టుకు వచ్చింది.

ఈ మధ్య కాలంలో తెలుగు లో రెజీనాకు ఆఫర్లు చాలా తక్కువ అయ్యాయి. దాంతో ఈమె కెరీర్ ఖతం అయ్యిందని, అయినట్లే అని చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో ఉత్సవం అనే సినిమాతో రెజీనా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. రెజీనా కు తెలుగు లో ఇది కచ్చితంగా చివరి అవకాశం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆఫర్ ని రెజీనా సద్వినియోగం చేసుకుని, అదృష్టం కొద్ది సక్సెస్ అయితే చిన్న సినిమాల్లో అయినా ఈమెకు ఆఫర్లు మరిన్ని వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement