Thursday, May 9, 2024

Re release | ఫ్యాన్స్‌కు మరో సారి ‘కిక్’..!

టాలీవుడ్ థియేటర్లలో రీరిలజ్ సినిమాల సందడి కొసాగుతొంది. రీసెంట్ గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “కెమెరామెన్ గంగతో రాంబాబు” రీ రిలీజ్ అయ్యిది. ఇక రేపు వాలెంటైన్స్ డే సందర్భంగా చాలా ప్రేమకథా చిత్రాలు థియేటర్స్ లో రీ రిలీజ్ కి సిద్దమయ్యాయి. ఇక ఈ సినిమాల తరువాత మాస్ మహారాజ రవితేజ నటించిన సూపర్ హిట్ మూవీ “కిక్” కూడా రీ రిలీజ్ కి రెడీ అయ్యింది.

ఈ నెల 9న గ్రాండ్ రిలీజ్ అయిన ఈగల్ తో హిట్ కొట్టిన రవితేజ.. మార్చ్ 1న కిక్ సినిమాతో మ‌రో సారి థియేటర్స్ లో ఆడియెన్స్ ని పలకరించనున్నాడు. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ఇలియానా హీరోయిన్ గా నటించింది. అలాగే థమన్ మ్యూజిక్ అందించాడు. ఇక ఈ సినిమాని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకోవడం విశేషం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement