Monday, May 6, 2024

రవితేజ 68@ ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది

శరత్ మండవ దర్శకత్వం మాస్ మహారాజా రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే రవితేజ కెరీర్ లో 68వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఏదో ఒక హింట్, అప్డేట్స్ ఇస్తూ అభిమానులకు సినిమాపై ఆసక్తి పెరిగేలా చేశారు శరత్ మండవ.

ఇక ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నారు. సోమవారం ఉదయం పదిగంటల ఎనిమిది నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది యూనిట్.

Advertisement

తాజా వార్తలు

Advertisement