Sunday, May 5, 2024

దర్శకరత్న బయోపిక్… అధికారిక ప్రకటన

ఇటీవల కాలంలో బయోపిక్ ల హవా పెరిగింది. సినీ రాజకీయ క్రీడ ప్రముఖులు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ లు విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు కూడా లాభాలను తెచ్చి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో బయోపిక్ కు రంగం సిద్ధమైంది. దర్శక దిగ్గజం దర్శకరత్న దాసరి నారాయణరావు బయో పిక్ కు రంగం సిద్ధం అయింది. ఈ బయోపిక్ పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ బయోపిక్ నిర్మించేందుకు నిర్మాత తాడివాక రమేష్ నాయుడు ముందుకు వచ్చారు. అలాగే ఈ బయోపిక్ కు దర్శకరత్న అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇక ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని అన్నారు నిర్మాత రమేష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement