Thursday, April 25, 2024

తెలంగాణ లో కొత్తగా 465 కరోనా కేసులు

తెలంగాణ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 465 కోవిడ్‌ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు కరోనా కారణంగా నలుగురు మంది మృతిచెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో 869 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య… 6,31,683 కు చేరగా.. రికవరీ కేసులు 6,17,638 కు పెరిగాయి. ఇక కరోనా తో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,729కి చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10,316 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement