Sunday, April 28, 2024

‘రామారావు’ ఆన్ డ్యూటీ – మాస్ మహారాజా

శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు డిఫరెంట్ టైటిల్ ని ఫిక్స్ చేశారు మేకర్స్. ‘రామారావు’ ఆన్ డ్యూటీ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఇక ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాను చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. అలాగే హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు. ఇక ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ ను రవితేజ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement