Saturday, May 18, 2024

Rashmika | ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న రష్మిక

టాలీవుడ్ లో గీత గోవిందం మూవీ తో ఎంట్రీ ఇచ్చి యూత్ కు దగ్గర అయ్యింది రష్మిక మందన. ఇక లేటెస్ట్‌గా యానిమల్ మూవీతో మ‌రింత‌ పాపులర్ హీరోయిన్ గా మారింది ఈ కన్నడ బ్యూటీ. కాగా, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్న రష్మిక.. తాజాగా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ సంస్థ వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన 30 ఏళ్లలోపు వ్యక్తులతో ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాను రూపొందించింది. ఇందులో రష్మిక టాప్ ప్లేస్లో నిలిచి ఆశ్చర్య పరిచింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ వేదికగా పంచుకుని, ఫోర్బ్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే పుష్ప2 : ది రూల్ లో నటిస్తుంది. ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. VD12 – విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి సినిమాలో నటిస్తుంది. D51 – ధనుష్ & శేఖర్ కమ్ముల సినిమాలో , రవితేజ- గోపీచంద్ మలినేని సినిమా లో, రెయిన్‌బో – లేడీ ఓరియెంటెడ్ మూవీలో , ఇక లేటెస్ట్‌గా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తుంది. ఇలా వరుస సినిమాలతో బిజీ గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement