Sunday, May 19, 2024

iPhone | వర్టికల్ కమెరాతో ఐఫోన్ 16 సిరీస్.. డిజైన్ ఫీచర్స్‌ లీక్ !

ఆపిల్ బ్రాండ్ ప్రియులు కొత్త ఐఫోన్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి సంవత్సరం, ఆపిల్ కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ వెర్షన్‌తో కొత్త ఫోన్‌ను విడుదల చేస్తుంది. గతేడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 15 సిరీస్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 విడుదల కానుంది. అయితే, విడుదలకు ముందు ఈ ఫోన్ ఫీచర్లు ఏమిటి? ఈ ఫోన్‌లో కంపెనీ ఎలాంటి కొత్త మార్పులు తీసుకురానుందనే దానిపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. తాజాగా, ఐఫోన్‌16 కు సంబంధించిన కీలక ఫీచర్లు, డిజైన్, ధర విషయాలు ఆన్ లైన్లో లీక్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆన్ లైన్లో లీకైన వివరాలను పరిశీలిస్తే.. ఐఫోన్ 16 సిరీస్ లో వెనుకవైపు కెమరా సెటప్ పూర్తిగా మారనున్నట్టు కనిపిస్తొంది. బ్యాక్ కెమెరా ఈసారి వర్టికల్ గా ఉండనున్నట్టు కన్పిస్తోంది. ఐఫోన్ 15 సిరీస్ లో ఇది చతురస్ర ఆకారంలో ఉంది. ఐఫోన్ 16 లో మాత్రం పొడవుగా ఉండే మాత్ర ఆకారంలో కెమెరా సెటప్ ఉండేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఐఫోన్ 16 సిరీస్ లో మొత్తం ఐదు మోడల్స్ రానున్నాయి. ఐఫోన్ 16 ఎస్ఈ, ఐఫోన్ 16 ప్లస్ ఎస్ఈ, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ పేర్లతో ఇవి రానున్నాయి. దీంతో ఐఫోన్ ఎస్ఈ మోడల్స్ ను ఐఫోన్ 16 సిరీస్ లో విలీనం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఐఫోన్ 16 ఎస్ఈ, ఐఫోన్ 16 ప్లస్ ఎస్ఈలో వెనుకవైపు ఒకే కెమెరా ఉండనున్నట్లు కన్పిస్తోంది. ఐఫోన్ 10 ను పోలి ఉన్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 16 లో మాత్రం డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనుంది. ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ మోడల్స్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కన్పిస్తోంది. ఈ మూడు మోడల్స్ లోనూ కెమెరా వర్టికల్ గా ఉంటుంది. ప్రస్తుత ఐఫోన్ 15 సిరీస్ లో వెనుకవైపు కెమెరా సెటప్ స్క్వేర్ షేప్ లో ఉంది.

- Advertisement -

ఇక ధర విషయానికి వస్తే ఐఫోన్ 16 ఎస్ఈ ధర రూ. 58,000 గా ఉండే అవకాశం ఉందని టిప్ స్టర్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఇది 128 జీబీ స్టోరేజీ ధర. ఐఫోన్ 16 ఎస్ఈ ప్లస్ ధర రూ. 66,000 గా ఉండవచ్చని పేర్కొన్నారు. ఇది 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర. అలాగే ఐఫోన్ 16 వెనీలా మోడల్ ధర కూడా రూ. 58,000 గా ఉండవచ్చన్నారు. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధరలు మాత్రం వరుసగా రూ. 83,000, రూ. 91,000 ఉండవచ్చని టిప్ స్టర్ రివీల్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement