Thursday, May 2, 2024

Rashmika: శ్రీవల్లి వయ్యారం…

‘పుష్ప’ సినిమాలో రష్మిక అభినయం ఆకట్టుకుంది. నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఇప్పుడు పుష్ప-2 ది రూల్‌లో మరోసారి మెరవనుంది. అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా పుష్ప -2లో ఆమె పాత్ర గెటప్ను రివీల్‌ చేస్తూ ఓ పోస్టరు విడుదల చేశారు.

ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టీ-జర్‌ విడుదల చేయనున్నారు. ఈ సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు- ప్రకటించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

ది గర్ల్‌ ఫ్రెండ్‌ ప్రత్యేక పోస్టర్‌

రశ్మిక మందన్న, దీక్షిత్‌ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌, మాస్‌ మూవీ మేకర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌-టైన్‌మెంట్‌సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.లవ్‌ స్టోరీతో దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ రూపొందిస్తున్నారు. ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. రశ్మిక మందన్న బర్త్‌ డే సందర్భంగా ది గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌ లో రశ్మిక సింపుల్‌ మేకోవర్‌ లో బ్యూటిఫుల్‌ గా కనిపిస్తోంది. ది గర్ల్‌ ఫ్రెండ్‌ లో ఆమె కాలేజ్‌ స్టూడెంట్‌ గా నటిస్తున్నట్లు- పోస్టర్‌ ద్వారా తెలుస్తోంది. వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ది గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమా ప్రస్తుతం రెగ్యులర్‌ షూటింగ్‌ లో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement